నెల్లూరు నగరానికి చెందిన ఓ వ్యక్తికి సంబంధించి ఈనెల 3వ తేదీన వచ్చిన కరోనా నివేదికల్లో మొదటి పాజిటివ్ ఉన్నట్లు వచ్చింది. ఆరోజే మళ్లీ వచ్చిన నివేదికలో నెగెటివ్ అని వచ్చింది. అయితే ఇందుకు సంబంధించిన నివేదికలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటివి చోటు చేసుకోవడం ఆందోళనకు గురి చేస్తోంది. దీనిపై నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి అదనపు ఆర్‌ఎంవో డాక్టర్ కనకాద్రిని వివరణ కోరగా.. ఆ వ్యక్తికి నెగెటివ్ అని తెలిపారు. టెక్నికల్ ఎర్రర్ వచ్చి మొదట పాజిటివ్‌గా నమోదైందని, వెంటనే మళ్లీ దానిని నిర్ధారించి నెగెటివ్‌గా గుర్తించి నివేదిక పంపారని వెల్లడించారు.
నెల్లూరు: ముందు పాజిటివ్.. తర్వాత నెగెటివ్ - నెల్లూరులో కరోనా కేసులు 34 న్యూస్
నెల్లూరులో ఇప్పటికే అత్యధికంగా 34 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే నెల్లూరు నగరానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పరీక్షల్లో గందరగోళం నెలకొంది. మెుదట పాజిటివ్ రాగా.. అదేరోజు మళ్లీ నెగెటివ్ వచ్చింది.
technical error in corona testing nellore