ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నెల్లూరులో చంద్రబాబు పర్యటన: నేడు ఆరు నియోజకవర్గాల కార్యకర్తలతో భేటీ - news of chandrababu latest

నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబు... ఇవాళ ఆరు నియోజకవర్గాల నేతలతో సమీక్ష జరపనున్నారు. కార్యకర్తల సమస్యలతో పాటు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.

tdp-supremo-chandrababu-second-day-visist-in-nellore-district

By

Published : Oct 15, 2019, 3:05 AM IST

Updated : Oct 15, 2019, 4:36 AM IST


తెదేపా అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లాలో నేడు రెండో రోజు సమీక్షలు నిర్వహించనున్నారు. మొదటి రోజు నాలుగు నియోజకవర్గాల కార్యకర్తలతో భేటీ అయ్యారు. వారి సమస్యలను ఓపికగా విన్నారు. ఒక్కొ నియోజకవర్గానికి రెండు గంటలకు పైగా సమయం కేటాయించారు. అధికార పార్టీ నేతలు తమ పై తప్పుడు కేసులు పెడుతూ బెదిరిస్తున్నారని కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఉదయగిరి, సూళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు నియోజకవర్గాల సమీక్షలు పూర్తి చేశారు. ఇవాళ ఆరు నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో సమీక్షలు జరపనున్నారు.

నెల్లూరులో చంద్రబాబు పర్యటన: నేడు ఆరు నియోజకవర్గాల కార్యకర్తలతో భేటీ
Last Updated : Oct 15, 2019, 4:36 AM IST

ABOUT THE AUTHOR

...view details