నిత్యావసర వస్తువుల నుంచి అన్నింటి ధరలు పెంచుతూ.. సామాన్యుల నడ్డి విరుస్తున్నారని నెల్లూరు నగర తెదేపా ఇన్‌ఛార్జి కోటంరెడ్డి విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడుతూ.. బాదుడే బాదుడు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యుత్తు ఛార్జీల్ని పెంచడమే కాకుండా కరెంటు కోతలతో నరకం చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీల్లో తిరుగుతూ విసనకర్రలు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు పంపిణీ చేశారు. నెల్లూరుకి మాజీ మంత్రి అనిల్ చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు.
"జగన్ బాదుడే బాదుడు" రాష్ట్రవ్యాప్తంగా తెదేపా నిరసనలు
TDP Protest: రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ప్రజలపై పెంచుతున్న భారాలకు నిరసనగా తెదేపా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. తాజాగా జగన్నను గెలిపిస్తే ప్రజలను బాదుడే బాదుడు అంటూ తెదేపా ఇన్‌ఛార్జి కోటంరెడ్డి నెల్లూరులో ప్రచారం చేశారు. నెల్లూరు నగర నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు.
ఎన్టీఆర్ జిల్లా: ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని మాజీమంత్రి దేవినేని ఉమ ప్రారంభించారు. ఎన్టీఆర్జిల్లా గొల్లపూడిలో ఆయన ప్రతి ఇంటికి తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ కోతలు, ఛార్జీల మోతలపై ఆరా తీశారు. ఇష్టానుసారం విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఉమకు వివరించారు. మిగులు విద్యుత్ రాష్ట్రాన్ని ప్రభుత్వం అధోగతి పాలు చేసిందంటూ ఆయన విమర్శించారు.
ఇదీ చదవండి: స్పిన్నింగ్ మిల్లులపై పవర్ కట్ ప్రభావం... ఉపాధి కోల్పోతున్న కార్మికులు