నెల్లూరు నగరం ముత్తుకూరు బస్టాండ్ సెంటర్ వద్దనున్న మద్యం దుకాణం వద్ద తెలుగుదేశం పార్టీ ఆందోళన చేపట్టింది. ఈ కార్యక్రమంలో నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాల తీరు మరీ దారుణంగా ఉందని నుడా మాజీ చైర్మన్ అన్నారు. కరోనా నిబంధనలు పాటించకుండా మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగిస్తున్నారని కోటంరెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రపతిని అవమానించేలా 'ప్రెసిడెంట్ మెడల్' పేరుతో మద్యం అమ్మకాలు సాగించడం దారుణమన్నారు. ఆ పేరుతో మద్యం తయారు చేసిన కంపెనీ, అనుమతించిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ తెదేపా నేతలు ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
'రాష్ట్రంలో మద్యం అమ్మకాల తీరు దారుణం' - tdp protest at nellore wine shop
కరోనా నిబంధనలు పక్కనపెట్టి మద్యం విక్రయాలను కొనసాగిస్తున్నారని నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. నెల్లూరులో మద్యం దుకాణం వద్ద ఆందోళన చేపట్టారు. కరోనా సమయంలో మద్యం దుకాణాలు మూసేయాలంటూ ప్లకార్డులు చేత పట్టుకుని కార్యకర్తలు నిరసనలో పాల్గొన్నారు.
నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి