శాసనసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిందే... జీఎన్ రావు, బోస్టన్ కమిటీ నివేదికల్లో ఉందని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో నేతల సమావేశంలో సోమిరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలోనే ఉండాలని డిమాండ్ చేశారు. మూడు చోట్ల రాజధానులు ఏర్పాటు చేస్తే... ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. చంద్రబాబుపై కక్షతోనే అమరావతికి భూములు ఇచ్చిన రైతులను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలందరూ వ్యతిరేకిస్తుంటే ముఖ్యమంత్రి జగన్ ఏకపక్షధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
'సీఎం జగన్ చెప్పిందే.. నివేదికల్లో చేర్చారు'
నియమించిన మూడు రోజుల్లో బీసీజీ నివేదిక ఎలా ఇచ్చిందని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. రాజధాని అంటే ఆటలనుకుంటున్నారా... అంటూ మండిపడ్డారు.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి