జగన్మోహన్ రెడ్డి పాలనలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పవర్ లేదని... వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులకు మాత్రమే పవర్స్ పని చేస్తున్నాయని మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చినరాజప్ప ఆక్షేపించారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా... 7 ,12 ,37, 38,40 డివిజన్లలో నామపత్రాలు సరిగా ఉన్న తెదేపా అభ్యర్థుల నామినేషన్లు ఎందుకు రద్దు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటున్న అధికారులు న్యాయపరంగా పని చేయాలి కానీ అధికార పార్టీకి వత్తాసు పలకడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ల సమస్యను పరిష్కరించకపోతే హైకోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా ఘన విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు.
TDP leaders : 'వచ్చే ఎన్నికల్లో తెదేపాదే అధికారం' - TDP leader china rajappa
జగన్మోహన్ రెడ్డి పాలనలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పవర్ లేదని... వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులకు మాత్రమే పవర్స్ పని చేస్తున్నాయని మాజీ మంత్రులు ఆరోపించారు. నెల్లూరు కార్పొరేషన్లో నెలకొన్న నామినేషన్ల సమస్యను పరిష్కరించకపోతే హైకోర్టుకు వెళ్తామని హెచ్చరించారు.
నెల్లూరులో తెదేపా నేతల పర్యటన