TDP leaders protest: నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట రోడ్డులో తెదేపా నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. తుమ్మలపెంట రోడ్డు దుస్థితిపై ఆర్అండ్బీ అధికారులకు విన్నవించుకుంటే సెప్టెంబర్ నెలాఖరు వరకు గడువు అడిగారని... అయినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కావలి నియోజకవర్గ తెదేపా ఇంఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. తుమ్మలపెంట రోడ్డులోని బురదలో కూర్చుని నిరసన తెలిపారు. తుమ్మలపెంట రోడ్డును చూస్తుంటే నరకానికి దారి ఇది అన్నట్లుగా కనిపిస్తోందని సుబ్బానాయుడు అన్నారు.
TDP leaders protest: బురద నీటిలో కూర్చొని నిరసన... ఎందుకంటే..? - tummalapenta road problem
TDP leaders protest: గ్రామానికి వెళ్లేందకు రోడ్డు సరిగా లేదని తెదేపా నాయకులు నిరసనకు దిగారు. నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట రహదారిలో బురద నీటిలో కూర్చుని నినాదాలు చెశారు.
నిత్యం వేలాది మంది ప్రజలు ఈ రోడ్డుపై ప్రయాణిస్తున్నారని, నేషనల్ హైవేకు దగ్గరగా ఉందని,.. మత్స్యకారులకు అత్యవసరమైన రోడ్డని మాలేపాటి సుబ్బానాయుడు తెలిపారు. పర్యాటక కేంద్రానికి వెళ్లే రోడ్డు కాబట్టి.. దీనిని త్వరితగతిన నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. తెదేపా ప్రభుత్వం హయాంలోనే ఈ రోడ్డు ఎన్డీబీ నిధుల కింద మంజూరు అయిందని.. దీనికితోడుగా మరో రెండు రోడ్ల పనులు జరుగుతున్నాయని అన్నారు. కేవలం దీనిని శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి ఎందుకు ఆటంకం కలిగిస్తున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. ధైర్యముంటే తుమ్మలపెంట రోడ్డులోని అభివృద్ధిపై చర్చకు రమ్మని సవాల్ విసిరారు.
ఇవీ చదవండి: