పెరిగిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు నగరంలో తెలుగుదేశం పార్టీ వినూత్న నిరసన(tdp leaders protest over raised power charges by ysrcp government) చేపట్టింది. తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని పోర్లుకట్ట వద్ద విద్యుత్ మీటర్లకు శవయాత్ర నిర్వహించారు. పాడిపై విద్యుత్ మీటర్లు పెట్టి ఊరేగింపుగా తీసుకెళ్లిన తెదేపా నేతలు.. వాటిని చివరికి పెన్నానదిలో నిమజ్జనం చేశారు.
TDP: విద్యుత్ మీటర్లకు శవయాత్ర.. నదిలో నిమజ్జనం!
రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా.. నెల్లూరు తెదేపా నాయకులు వినూత్న నిరసన తెలిపారు. విద్యుత్ మీటర్లకు శవయాత్ర నిర్వహించి.. నదిలో నిమజ్జనం చేశారు.
వైకాపా పాలనలో బతుకు భారం..
ప్రజలపై ఎలాంటి భారాలూ వేయబోమని అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి జగన్.. ఇప్పుడు ట్రూఅప్ ఛార్జీల పేరుతో మోయలేని విద్యుత్ బిల్లుల భారాన్ని మోపుతున్నారని కోటంరెడ్డి ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వ హయాంలో నిత్యావసరాల ధరలతో పాటు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, విద్యుత్ ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు అవస్థలు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి.. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
జడ్పీటీసీ టిక్కెట్టు కోసం రూ.50 లక్షలు ఇచ్చాం: వైకాపా నేత సుబ్బారెడ్డి