TDP leaders: ముఖ్యమంత్రి జగన్ నిలకడ లేమి విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. మాట తప్పి, మడమ తిప్పి వ్యవసాయ, ఆక్వా రంగాలను ముంచేశారని ఆరోపించారు. మోటార్లకు మీటర్లు పెడితే రైతుల మెడకు ఉరి బిగించినట్టేనని, దీనిపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా మనుబోలులో తెదేపా ‘రైతు పోరు’ సభ గురువారం నిర్వహించింది.
TDP leaders: మోటార్లకు మీటర్లు పెడితే ఉద్యమిస్తాం: తెదేపా నేతలు - నెల్లూరులో తెదేపా నేతల పర్యటన
TDP leaders: సీఎం జగన్ విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెదేపా నేతలు ఆరోపించారు. మోటార్లకు మీటర్లు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోటార్లకు మీటర్లు పెడితే రైతుల మెడకు ఉరి బిగించినట్టేనని, దీనిపై ఉద్యమిస్తామని హెచ్చరించారు.
తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ‘మొన్నటివరకు వ్యవసాయమంటే అర్థం తెలియని కన్నబాబు.. శాఖ మంత్రిగా వెలగబెట్టారు. ఇప్పుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి రైతులకు ఒరగబెట్టిందేమీ లేదు’ అని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రూ.400 కోట్ల బకాయిలను 4నెలలైనా రైతులకు చెల్లించలేదని మండిపడ్డారు.
ఇవీ చదవండి: