ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు తొలగించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజా విజయమని తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రంగులు వేసి, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వైకాపా ప్రభుత్వం వృథా చేసిందని విమర్శించారు. నెల్లూరులో మాట్లాడిన ఆయన.. రంగులు వేయడానికి, వాటిని తొలగించడానికి సుమారు రూ. 300 కోట్లు వృథా అయ్యాయని, వాటికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.
'రంగుల పేరుతో రూ.300 కోట్ల ప్రజాధనం వృథా' - నెల్లూరు జిల్లా వార్తలు
ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడానికి, తిరిగి తొలగించడానికి సుమారు రూ.300 కోట్లు వృథా చేశారని తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆరోపించారు. ప్రజాధనాన్ని వృథా చేసినందుకు, ఆ నష్టాన్ని సీఎం సొంత డబ్బులతో తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
తెదేపా నేత తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి
ముఖ్యమంత్రి జగన్.. రంగుల కోసం వృథా చేసిన సొమ్ము తిరిగి చెల్లించాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు. పోలవరంలో అవినీతి జరగలేదని కేంద్ర జలశక్తి శాఖ స్వయంగా ప్రకటించిందన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి, మంత్రులు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. వాలంటీర్ల వ్యవస్థ అవినీతిమయమైందని ఆరోపించారు.
ఇదీ చదవండి :'ఆ నిధులు ఎలా మళ్లిస్తారు... మీ సొంత డబ్బులతో రంగులు మార్చండి'