వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి బీదా రవిచంద్ర ధ్వజమెత్తారు. వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. కనీస సహాయం చేయలేదని విమర్శించారు.
నెల్లూరు నగరంలో పలువురు వైకాపా నుంచి తెదేపాలో చేరారు. రవిచంద్ర వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2015లో నెల్లూరులో వచ్చిన వరదల సమయంలో అప్పటి సీఎఁ చంద్రబాబు తక్షణ సహాయం అందించారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. వరద బాధితులకు రూ. 500లు ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వకపోవడం దారుణమన్నారు.