జగన్నాథుడికే పంగనామాలు పెట్టగల సమర్థుడు సీఎం జగన్ అని.. తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. హిందువుగా మారినా హైదరాబాద్లోని ఇంటిపైనున్న క్రైస్తవ మత గుర్తును మార్చలేదన్నారు.
తన తప్పులు తెలియకుండా ఉండేందుకు ఆడుతున్న గోపూజ డ్రామాలు సీఎం జగన్ మానుకోవాలని వెంకటరమణారెడ్డి సూచించారు. ఏకపక్ష ధోరణి మాని, అన్ని మతాలను సమానంగా చూడాలన్నారు. మైనార్టీలను ఉద్ధరిస్తున్నామని చెప్పి.. వారి నిధులకే చిల్లులు పెట్టారని ఆరోపించారు. భక్తులు కానుకలను ఇతర పథకాలకు వాడే హక్కు లేదని పేర్కొన్నారు. ఏ శాఖ నిధులు దానికే వినియోగిస్తామని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.