ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆత్మకూరులో రేపటి నుంచి.. నిబంధనలు కఠినతరం - నెల్లూరు జిల్లా తాజా వార్తలు

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కొవిడ్ కేసులు పెరుగుతున్నందున.. కఠినమైన ఆంక్షలు అమలు చేయనున్నట్టు ఆర్.డి.ఓ చైత్ర వర్షిని తెలిపారు. రేపటి నుంచి.. ప్రతి రోజు ఉదయం 6.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు మాత్రమే వ్యాపార కార్యకలాపాలకు అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

rdo
ఆర్.డి.ఓ చైత్ర

By

Published : May 4, 2021, 9:19 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్నందున కఠినమైన ఆంక్షలు అమలు చేయనున్నట్లు ఆర్.డి.ఓ చైత్ర వర్షిని తెలిపారు. రేపటి నుంచి కట్టుదిట్టమైన కర్ఫ్యూ అమలులో ఉంటుందని చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వ్యాపార దుకాణాలకు అనుమతి ఇస్తున్నట్లు వివరించారు.

బయట తిరిగే వారు తప్పక మాస్కులు ధరించాలని తెలిపారు. అలా ధరించక పోతే 100 రూపాయల ఫైన్ వేస్తామని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప ఏ ఒక్కరూ బయటకు రాకూడదని, అనవసరంగా బయటకు వస్తే.. చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిబంధనలను పోలీసు, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో అమలు చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details