Sangam Barrage name change: నెల్లూరు జిల్లాలో పెన్నా నదిపై సంగం వద్ద నిర్మాణంలో ఉన్న సంగం బ్యారేజ్‌కు దివంగత మాజీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి పేరును పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇటీవల మంత్రి మేకపాటి అకాల మరణంతో ఆయన సొంత నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న ఈ బ్యారేజ్‌కు.. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరును ప్రకటిస్తూ అసెంబ్లీలో సీఎం జగన్ తీర్మానం చేశారు.
Sangam Barrage: సంగం బ్యారేజీ పేరు మారుస్తూ జీవో... ఆ పేరేంటంటే..? - నెల్లూరు జిల్లా లేటెస్ట్ అప్డేట్స్
Sangam Barrage name change: సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మే నెలలో బ్యారేజ్‌ను ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇకపై సంగం బ్యారేజ్.. మేకపాటి గౌతం రెడ్డి బ్యారేజ్‌గా మారుతుంది.
![Sangam Barrage: సంగం బ్యారేజీ పేరు మారుస్తూ జీవో... ఆ పేరేంటంటే..? Sangam Barrage name change as Mekapati Goutham Reddy Barrage](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15018695-161-15018695-1649938208708.jpg)
ఈ తీర్మానం నేపథ్యంలో సంగం బ్యారేజ్ పనులను వేగవంతం చేయాలంటూ ఇటీవల అధికారులకు ఆదేశాలు అందాయి. బ్యారేజ్ నిర్మాణ పనుల స్థితిగతుల్ని మేకపాటి గౌతం రెడ్డి తండ్రి, మాజీ పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇటీవల పరిశీలించారు. సంగం బ్యారేజ్‌పై దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే అధికారులు, కుటుంబ సభ్యలు తెలిపారు. మే నెలలో బ్యారేజ్‌ను ప్రారంభించేందుకు సర్వం సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇకపై సంగం బ్యారేజ్.. మేకపాటి గౌతం రెడ్డి బ్యారేజ్‌గా మారుతుంది.
ఇదీ చదవండి: ఒంటిమిట్ట రామయ్య కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి : తితిదే ఈవో జవహర్ రెడ్డి