Staff not available: నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడలో వైద్యం కోసం వచ్చి ఆస్పత్రి ఎదుటే వేచి చూడాల్సి వచ్చిందని బాధితురాలి బంధువులు ఆరోపించారు. అర్థరాత్రి కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన మహిళ... 2గంటల సమయంలో సిబ్బంది లేక ఆరుబయటే వేచి ఉన్నామని మహిళ కుటుంబ సభ్యులు తెలిపారు. మహిళ అవస్థను చూసి వాచ్మెన్ తెల్లవారుజామున... నర్సును తీసుకొచ్చి వైద్యం అందించారన్నారు. ఆస్పత్రికి తాళాలు వేసి ఉన్నాయని,.. సిబ్బంది ఉందుబాటులో లేరని బంధువులు ఆరోపించారు. సిబ్బంది లేకపోవడంతో రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు వైద్య సిబ్బంది తీరుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Staff not available: అర్ధరాత్రి కడుపునొప్పి.. ఆస్పత్రిలో సిబ్బంది లేక మహిళ నరకయాతన - Staff not available
Staff not available: ప్రాథమిక ఆస్పత్రిలో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన మహిళ అర్ధరాత్రి 2 గంటలకు ఆస్పత్రి బయటే వేచివున్న ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. తెల్లవారుజామున వాచ్మెన్... నర్సును తీసుకొచ్చి బాధితురాలికి వైద్య సేవలు అందించారు. సిబ్బంది లేకపోవడంతో రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడుపునొప్పితో వచ్చిన మహిళ
Last Updated : Sep 20, 2022, 2:53 PM IST