ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నెల్లూరు గ్రంథాలయం.. ఇక్కడ కూర్చోవాలంటే భయం!

Nellore District Library: బూజు పట్టిన భవనంలో గ్రంథాలయం..! వెలుతురు లేని గదులు..! దుమ్మూధూళితో నిండిన పుస్తకాలు..! వర్షాలు కురిస్తే.. పాఠకుల్లో తెలియని భయం..! అంతటా డిజిటలైజేషన్ మాట ఉన్నా అక్కడ ఆ ఊసే లేదు..! నెల్లూరులోని జిల్లా గ్రంథాలయంపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం..

By

Published : Mar 10, 2022, 3:28 PM IST

Nellore District Library
నెల్లూరులోని జిల్లా గ్రంథాలయం

Nellore District Library: గ్రంథాలయాలను డిజిటలైజ్ చేస్తామన్న ప్రభుత్వ హామీలు.. ఇక్కడ నీటిపై రాతలే అయ్యాయి. అన్ని జిల్లా కేంద్రాల్లోని గ్రంథాలయాల ప్రస్తుత పరిస్థితే ఇందుకు నిదర్శనం. నెల్లూరులోని లైబ్రరీ కొత్త భవనాల నిర్మాణ పనులు సగంలోనే నిలిచాయి. ఎప్పుడో దశాబ్దాల క్రితం నిర్మించిన పాత భవనం... శిథిలావస్థకు చేరింది. పైన కాంక్రీట్ కూడా దెబ్బతింది. వర్షాలకు గోడలు తడిసిపోయి.. చెమ్మ బయటకు వస్తోంది. దీంతో.. ఇక్కడ కూర్చోవాలంటే పాఠకులు భయపడుతున్నారు.

నెల్లూరులోని జిల్లా గ్రంథాలయం

"ప్రస్తుతం ఇక్కడ డిజిటల్​ లైబ్రరీ అందుబాటులో లేకపోవడం వల్ల ఇంటర్​నెట్​ సౌకర్యాన్ని వినియోగించుకోలేకపోతున్నాం. కొత్త ఫర్నిచర్​, ప్రతినెల వచ్చే అన్ని రకాల పోటీ పరీక్షల పుస్తకాలూ అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం" - నిరుద్యోగి

Nellore District Library: అన్నీ భరిస్తూ చదువుకుందామనుకున్నా గదుల్లో సరైన వెలుతురు, కుర్చీలు లేకపోవడం ఇబ్బందిగా మారిందని పాఠకులు అంటున్నారు. శుభ్రత లేక చెదలు పట్టిందని అంటున్నారు.

"ఇక్కడ చదువుకోవడానికి బాగానే ఉంది. ఇక్కడ చదువుకుని ఎంతోమంది ఉద్యోగాలు కూడా సాధించారు. కానీ.. ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. వర్షాకాలంలో ఇబ్బంది ఉంటుంది. వర్షం పడితే మొత్తం ఎక్కడపడితే అక్కడ పైకప్పు నుంచి నీరు కారుతున్నాయి. మాకు ఇంటర్​నెట్​ సౌకర్యం కూడా సరిగ్గా లేదు." - విద్యార్థి

Nellore District Library: నిధుల మంజూరులో జాప్యం వల్ల గ్రంథాలయానికి భవన నిర్మాణం నిలిచిందని జిల్లా గ్రంథాలయ కార్యదర్శి ప్రసాద్ స్పష్టం చేశారు. పనులు పూర్తయ్యాకే డిజిటలైజేషన్ పూర్తి చేస్తామన్నారు.

ఇదీ చదవండి:విదేశీ మహిళపై అత్యాచారయత్నం.. గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details