ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నెల్లూరు జిల్లాలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్ - నెల్లూరు జిల్లాలో పారిశుద్ధ్యంపై డ్రైవ్

నివర్ తుపాను నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాలను వరదతో ముంచేసింది. పెన్నానది, సముద్ర తీరం ప్రాంత గ్రామాల్లో ఐదు రోజులుగా నీరు నిలబడి బురదగా మారాయి. పారిశుద్ధ్య పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. కాల్వల్లో వరద నీరు పారుదల లేక దుర్గంధంగా మారాయి. వర్షపు నీటితో తాగునీటి పథకాలు కలుషితమయ్యాయి. కొన్నిచోట్ల పైప్ లైన్లు వరదనీటిలో మునిగాయి. రక్షిత పథకాల మోటార్లు మరమ్మతులకు గురయ్యాయి. కొత్త నీరు చేరడంతో ప్రజలకు తాగునీటి వల్ల అంటురోగాలు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

sanitization drive i
sanitization drive i

By

Published : Dec 7, 2020, 10:57 PM IST

నెల్లూరు జిల్లాలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్

నెల్లూరు జిల్లాలో గత 10 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. పారిశుద్ధ్యం దెబ్బతింది. ప్రతి గ్రామంలోనూ రోడ్లు, కాల్వలు అధ్వాన్నంగా ఉన్నాయి. ఈ పరిస్థితులను మెరుగుపరచడానికి జిల్లా పంచాయతీ అధికారులు ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. సముద్రం, పెన్నానది తీర ప్రాంతాల్లోని పంచాయతీల్లో పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు చెప్పట్టారు. 2500 మంది గ్రీన్ అంబాసిడర్లు, గ్రీన్ గార్డులను నియమించారు.

పారిశుద్ధ్య పనులు

జిల్లాలోని పంచాయతీల్లో 1000 మంది కాంట్రాక్ట్ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరందరూ వర్షపు నీరు నిలబడిన ప్రాంతాలను గుర్తించారు. ప్రొక్లైయిన్​తో నీటిని బయటకు పంపుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో మనుషుల చేత నీటిని తోడుతున్నారు. గ్రామాల్లో మురుగు కాల్వల్లో పూడికలు తీయిస్తున్నారు. వర్షాలకు దోమలు వృద్ధి చెందకుండా, సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేస్తున్నారు. పారిశుద్ధ్య పనులు మెరుగుపరిచి బ్లీచింగ్, సున్నం చల్లుతున్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం అనే పిలుపుతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు.

తాగునీటి క్లోరినేషన్

జిల్లాలోని 284 గ్రామ పంచాయతీలను ఈ డ్రైవ్​లో ఎంపిక చేశారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యం, విద్యార్థులు, ఎన్జీవోలు స్వచ్చందంగా ముందుకు వచ్చే వారి సహకారం అందించాలని కోరుతున్నారు. ప్రజలకు అంటువ్యాధులు ప్రబలకుండా పంచాయతీలను స్వచ్ఛంగా మార్చడమే ప్రధాన లక్ష్యమని కలెక్టర్​ తెలిపారు. స్వచ్చంధ్ర కార్పొరేషన్ ద్వారా 73 ట్రాక్టర్లు వినియోగిస్తున్నారు. జిల్లాలో డస్ట్ బిన్లు కొరత ఉందని గుర్తించారు. తాగునీటిని క్లోరినేషన్ చేస్తున్నారు. కలుషితం ఉంటే ట్రాన్స్ పోర్టు ద్వారా అందిస్తామని అంటున్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 11 లక్షల మంది రక్షిత పథకాల మీద ఆధారపడి ఉన్నారు. 1500 మంచి నీటి పథకాలు ఉన్నాయి.

వేడి చేసి చల్లార్చిన నీరు తాగాలి

వరద ప్రవాహం వచ్చిన పంచాయతీల్లో పైప్ లైన్లు మునిగిపోయాయి. కొన్నిచోట్ల మోటార్లు నీళ్లలో ఉన్నాయి. వర్షపు నీరు కారణంగా తాగునీటి పథకాల్లో మార్పు వస్తుంది. ప్రజలకు తాగునీటి వల్ల అనారోగ్యాలు రాకుండా ఉండాలంటే క్లోరినేషన్ చేయిస్తే ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. ప్రజలు కూడా వేడిచేసి చల్లార్చిన నీటిని తాగాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి :అంతుచిక్కని వ్యాధి...అంతకంతకూ పెరుగుతున్న ఆందోళన

ABOUT THE AUTHOR

...view details