Nellore SP: నెల్లూరులో బాలికపై దాడి కేసులో మేనమామనే నిందితుడిగా పోలీసులు తేల్చారు. చాకుతో మేనమామే బాలికపై దాడి చేశాడని ఎస్పీ విజయరావు వెల్లడించారు. సంఘటన జరిగిన తర్వాతే పోలీసులకు సమాచారం వచ్చిందన్నారు. తాను కూడా జీజీహెచ్‌కు వెళ్లి బాలికను పరామర్శించినట్లు తెలిపారు. బాలికను చెన్నైలోని చిల్డ్రన్స్ అపోలో ఆస్పత్రికి తరలించారని తెలిపారు. ఇంట్లో ఉన్న బాత్రూం యాసిడ్‌తో నిందితుడు దాడి చేశాడని పేర్కొన్నారు. చెవిదిద్దులు ఇవ్వాలని బాలికపై దాడి చేశాడని వివరించారు. నాగరాజుకు త్వరగా శిక్షపడేలా చూస్తామన్నారు. నిందితుడు నాగరాజుపై రౌడీషీట్ ఓపెన్ చేశామని స్పష్టం చేశారు. మద్యం మత్తులోనే నాగరాజు బాలికపై దాడి చేశాడని ఎస్పీ చెప్పారు. ఈ మేరకు మీడియాకు ఎస్పీ వివరాలు వెల్లడించారు.
Nellore SP: మద్యం మత్తులో.. చెవిదిద్దుల కోసం బాలికపై దాడి : నెల్లూరు ఎస్పీ
Acid Attack case: చెవిదిద్దులు ఇవ్వాలని బాలికపై మేనమామ దాడి చేశాడని నెల్లూరు ఎస్పీ తెలిపారు. చాకుతో బాలికపై దాడి చేసినట్లు వివరించారు. నిందితుడిపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు పేర్కొన్నారు.
"చాకుతో మేనమామే బాలికపై దాడి చేశాడు. సంఘటన జరిగిన తర్వాతే పోలీసులకు సమాచారం వచ్చింది. నేను కూడా జీజీహెచ్‌కు వెళ్లి బాలికను పరామర్శించాను. బాలికను చెన్నైలోని చిల్డ్రన్స్ అపోలో ఆస్పత్రికి తరలించాం. ఇంట్లో ఉన్న బాత్రూం యాసిడ్‌తో నిందితుడు దాడి చేశాడు. చెవిదిద్దులు ఇవ్వాలని.. బాలికపై దాడి చేశాడు. నాగరాజుకు త్వరగా శిక్షపడేలా చూస్తాం. నిందితుడు నాగరాజుపై రౌడీషీట్ ఓపెన్ చేశాం. మద్యం మత్తులోనే నాగరాజు బాలికపై దాడి చేశాడు." -విజయరావు, నెల్లూరు ఎస్పీ
ఇవీ చదవండి: