ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన సోనూసూద్ - oxygen plant by sonu sood in nellore district

అవసరం ఏదైనా.. ఎవరికైనా నేనున్నానంటూ స్పందిస్తున్న నటుడు సోనూసూద్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. మిత్రుడి విజ్ఞప్తి మేరకు నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సోనూసూద్‌ ముందుకొచ్చారు. ఈ విషయాన్ని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ధ్రువీకరించారు.

oxygen plant by sonu sood in Nellore district
నెల్లూరు జిల్లాలో సోనూసూద్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు
author img

By

Published : May 18, 2021, 8:26 AM IST

సినీ నటుడు సోనూసూద్‌ మరోమారు గొప్ప మనసు చాటుకున్నారు. నెల్లూరు జిల్లాలో రూ. 1.5 కోట్ల వ్యయంతో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. నెల్లూరులోని జెండా వీధిలో ఉంటున్న సోనూసూద్‌ మిత్రుడు సమీర్‌ఖాన్‌ కుటుంబ సభ్యులకు ఇటీవల కరోనా మహమ్మారి సోకింది. ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ పడకలు దొరక్క వారు మృత్యువాతపడ్డారు.

ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని సోనూసూద్‌ను సమీర్‌ఖాన్‌ కోరారు. సోనూసూద్ ఇందుకు సానుకూలంగా స్పందించడంతో సమీర్‌ఖాన్‌ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఫోన్‌లో మాట్లాడించారు. ఆత్మకూరు లేదా కావలి ప్రాంతంలో ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ విషయాన్ని నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ధ్రువీకరించారు. జిల్లాలో 2 టన్నుల సామర్థ్యం ఉన్న ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఒకటి ఏర్పాటు చేసేందుకు అవసరమైన నిధులను సోనూసూద్‌ అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు సమాచారం పంపారని.. త్వరలో దీని నిర్మాణాన్ని చేపడతామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details