నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలంపాడ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న రజియా బేగంకు మరోసారి కష్టం వచ్చింది. 19 ఏళ్ల కుమారుడు నిజాముద్దీన్ అమన్ ఈశాన్య ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తీవ్రమైన క్రమంలో వసతి గృహాం సమీపంలోని మెట్రో స్టేషన్‌ను మాస్కో సేనలు పేల్చేయడంతో బంకర్లో తలదాచుకున్నట్లు నిజాముద్దీన్ తల్లి తెలిపారు. 14 ఏళ్ల క్రితం మూత్రపిండాలు చెడిపోవడంతో భర్తను కోల్పోయిన రజియా బేగం.. అప్పటి నుంచి రోగులకు సేవ చేస్తున్నారు. ఈ పరిస్థితులతోనే తన కొడుకు వైద్య వృత్తి వైపు మొగ్గుచూపాడని ఆమె తెలిపారు.
కుమారుడి కోసం వందల కిలోమీటర్లు...
2020 మార్చిలో కరోనా వ్యాప్తితో అకస్మాత్తుగా లాక్‌డౌన్ విధించారు. నెల్లూరులో చిక్కుకుపోయిన తన కొడుకును తీసుకురావడానికి ద్విచక్ర వాహనంపై రజియా బేగం ఒంటరిగా వెళ్లి అప్పట్లో వార్తల్లో నిలిచారు. మూడు రోజుల పాటు ప్రయాణించి కుమారుడిని ఇంటికి తీసుకొచ్చారు. వైద్య విద్య కోసం ఉక్రయిన్ వెళ్లిన నిజాముద్దీన్ మరోసారి చిక్కుకోవటంతో కన్నపేగు అల్లాడుతోంది.
ప్రభుత్వాలకు విజ్ఞప్తి...