తిరుపతి లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో... నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. మద్యం ధరలు భారీగా పెంచి పేదల నడ్డి విరుస్తున్నారన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్జీఎస్ కింద రూ.2 వేల కోట్ల నిధులు రాష్ట్రానికి విడుదల చేస్తే.... ప్రభుత్వం నీరు చెట్టు కింద పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేయకుండా చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మూడు రాజధానులు అంటూ.. రాష్ట్ర రాజధాని అమరావతిని గందరగోళంగా తయారు చేశారన్నారు. తిరుపతి లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికలో తెదేపా తరఫున పోటీ చేస్తున్న పనబాక లక్ష్మిని గెలిపించేందుకు ప్రతి తెదేపా కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు.