ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైలు నుంచి పొగలు.. భయంతో ప్రయాణికుల పరుగులు - నెల్లూరు జిల్లా తాజా వార్తలు

Smoke From Train: భువనేశ్వర్​ నుంచి తిరుపతి బయలుదేరిన ఓ రైలులో పొగలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు భయందోళనకు గురయ్యారు. సమస్యను గుర్తించిన సిబ్బంది పొగను అదుపు చేయటంతో ప్రయాణికులు ఉపిరి పిల్చుకున్నారు. ఇంతకీ ఇది ఎక్కడంటే..

Smoke from Bhubaneswar Express
రైలు నుంచి పొగలు

By

Published : Sep 18, 2022, 6:55 PM IST

Smoke From Train: నెల్లూరు జిల్లాలోని వేదాయపాళెం రైల్వే స్టేషన్ సమీపంలో భువనేశ్వర్​ ఎక్స్​ప్రెస్ నుంచి పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. భువనేశ్వర్​ నుంచి తిరుపతి బయల్దేరిన భువనేశ్వర్​ ఎక్స్​ప్రెస్​లో వేదాయపాళెం రైల్వే స్టేషన్ సమీపానికి రాగానే పొగలు లేచాయి. ఎస్-3 భోగి నుంచి పొగ రావటంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. భోగి నుంచి పొగ రావటాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది అప్రమత్తమై రైలు నిలిపివేశారు. ప్రయాణికులు కిందకి దిగి.. భోగి నుంచి దూరంగా పరుగులు తీశారు. సమస్యను గుర్తించిన సిబ్బంది.. పొగను అదుపు చేయటంతో ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. సమస్య పరిష్కారం కావటంతో రైలు అక్కడినుంచి బయలుదేరి వెళ్లింది.

ABOUT THE AUTHOR

...view details