జిల్లాల పునర్విభజనలో భాగంగా... కావలిలో నెల్లూరు గ్రామీణ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో డీఐజీ త్రివిక్రమ్ వర్మ, జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్, అడిషనల్ ఎస్పీ వెంకటరత్నంలతో కలిసి పలుచోట్ల స్థలాలను పరిశీలించారు. కావలి పట్టణంలోని పోలీస్ నివేశన స్థలం, జమ్మలపాలెం, వెంగళ రావు నగర్‌లోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న స్థలాన్ని, వైకుంఠపురం వద్ద ఉన్న పీజీ సెంటర్ స్థలాలను సందర్శించారు. అనంతరం పట్టణంలో ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనాన్ని పరిశీలించారు. అందులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజ్‌ల వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కావలి డీఎస్పీ ప్రసాద్, సీఐలు అక్కేశ్వరరావు, మల్లికార్జున, ఎస్ఐలు పాల్గొన్నారు.
పోలీసు కార్యాలయాల ఏర్పాటుకు స్థల పరిశీలన - nellore updates
జిల్లాల పునర్విభజన జరిగితే కావలి పట్టణంలో ఏర్పాటయ్యే పోలీసు కార్యాలయాలు, మైదానాలు, సిబ్బంది, అధికారుల నివాస సముదాయాలకు అవసరమయ్యే స్థలాలను డీఐజీ తివిక్రమవర్మ పరిశీలించారు.
పోలీసు కార్యాలయాల ఏర్పాటుకు స్థల పరిశీలన