ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడు రాష్ట్రానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

నేటి నుంచి 3 రోజుల పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాష్ట్రంలో పర్యటించనున్నారు. నెల్లూరు, కడప జిల్లాల్లో పలు  శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. జిల్లాలో కేంద్ర బలగాలతో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు  చేశారు.

నేడు రాష్ట్రానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

By

Published : Aug 24, 2019, 3:20 AM IST


ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు రాష్ట్రానికి రానున్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు నెల్లూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయనతో పాటు గవర్నర్​ బిశ్వభూషణ్​ పలువురు కేంద్రమంత్రులు విచ్చేయనున్నారు. ప్రముఖుల రాకతో రాష్ట్రంలో కేంద్ర బలగాలతో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • నేడుమధ్యాహ్నం 12. 40 గంటలకు చెన్నై విమాశ్రయం నుంచి ప్రత్యేక ఎయిర్​ఫోర్స్​ హెలికాప్టర్​లో ఉపరాష్ట్రపతి నెల్లూరుకు బయలుదేరుతారు.
  • మధ్యాహ్నం 1. 20 గంటలకు నెల్లూరు పోలీస్​ పరేడ్​ మైదానానికి చేరుకుంటారు. అటునుంచి నగరంలోని వారి నివాసానికి వెంకయ్యనాయుడు వెళ్లనున్నారు.
  • సాయంత్రం 3.20 గంటలకు వెంకటాచలం రైల్వేస్టేషన్​ నుంచి ప్రత్యేక రైలులో కృష్ణపట్నం- ఓబులవారిపల్లి రైల్వే లైన్​ను పరిశీలిస్తారు. సాయంత్రం 5 గంటలకు కడప జిల్లా చెర్లోపల్లి రైల్వేస్టేషన్ చేరుకుంటారు. అనంతరం 5.30 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు వెంకటాచలం వెళ్లనున్నారు. స్వర్ణ భారతి ట్రస్ట్​లో ఆ రాత్రి ఉపరాష్ట్రపతి బస చేస్తారు.
  • రేపుఉదయం 9 గంటలకు ట్రస్ట్​లోని వైద్యశిబిరాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 10.25 గంటలకు రోడ్డు మార్గాన గూడూరు రైల్వే స్టేషన్​ చేరుకుని...విజయవాడ- గూడూరు ఇంటర్​ సిటీ ఎక్స్​ప్రెస్​ను ప్రారంభిస్తారు.
  • మధ్యాహ్నం 12.15 గంటలకు నెల్లూరు కస్తూర్భా కళాక్షేత్రంలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో వెంకయ్యనాయుడు పాల్గొంటారు. సాయంత్రం 3.50 గంటలకు వీపీఆర్​ ఫంక్షన్​ హాల్​లో ఏర్పాటు చేసిన అభినందన సభకు హాజరవుతారు.
  • తిరిగి స్వర్ణ భారత్​ ట్రస్ట్​కు చేరుకుని అక్కడే బస చేస్తారు.
  • ఆదివారంఉదయం 11.30 గంటలకు కొడవలూరు మండలం బొడ్డువారిపాళెం వద్ద మిథాని అల్యూమినియం పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు.
  • అనంతరం నెల్లూరులోని నివాసానికి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్​లో విజయవాడకు బయల్దేరుతారు.

ఈ పర్యటనలో ఉపరాష్ట్రపతితో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, రైల్వే శాఖ మంత్రి పీయూష్​ గోయల్​, హోం శాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని మాజీ మంత్రి, భాజపా నేత కామినేని శ్రీనివాస్​ వెల్లడించారు.

పర్యటన వివరాలు తెలియజేస్తున్న కామినేని శ్రీనివాస్​

ఇవీ చదవండి...'వారి ప్రవర్తనతో తీవ్ర మనస్తాపానికి గురయ్యా'

ABOUT THE AUTHOR

...view details