ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

PROTEST : 'నిలిచిపోయిన బకాయిలను వెంటనే చెల్లించాలి' - sand vehicle drivers protest in nellore

నెల్లూరు జిల్లాలో ఇసుక డ్రైవర్ల ఆందోళన కొనసాగుతోంది. ఇసుక తరలించే డ్రైవర్లకు, నిర్వహకులకు బకాయిలు చెల్లించే విషయంపై ఘర్షణ తలెత్తింది.సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో ఇసుక డ్రైవర్ల ఆందోళన
నెల్లూరు జిల్లాలో ఇసుక డ్రైవర్ల ఆందోళన

By

Published : Oct 29, 2021, 2:38 AM IST

నెల్లూరు జిల్లాలో ఇసుక డంపింగ్ నిర్వహాకులకు, టిప్పర్ డ్రైవర్ల మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఇసుక యార్డు వద్ద డ్రైవర్లు ఆందోళనకు దిగడంతో వివాదం తీవ్ర స్థాయికి చేరింది. ఆత్మకూరు, నెల్లూరుపాలెం, సంగం ప్రాంతాల్లో ఇసుక తరలించే డ్రైవర్లకు, నిర్వహకులకు బకాయిలు చెల్లించే విషయంపై ఘర్షణ తలెత్తింది. ఐదు నెలలుగా నిలిచిపోయిన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ...వాహనాలను నిలిపివేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details