నెల్లూరులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హత్య కేసులో నిందితుడైన గవాస్కర్ తేజను బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి హతమార్చారు. మృతుడు చంద్రబాబు నగర్ ప్రాంతంలో నివాసముంటున్న రౌడీ షీటర్‌గా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వేదాయపాలెం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పాతకక్షల నేపథ్యంలోనే హత్య జరిగి ఉంటుందని సీఐ సుబ్బారావు భావిస్తున్నారు.
నెల్లూరులో రౌడీషీటర్ దారుణ హత్య - నెల్లూరు తాజా వార్తలు
నెల్లూరులో రౌడీషీటర్ గవాస్కర్ తేజను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి హత్యచేశారు. పాత కక్షల నేపథ్యంలో జరిగి ఉండవచ్చని వేదాయపాలెం పోలీసులు భావిస్తున్నారు. సీఐ సుబ్బారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హత్య చేయబడ్డ రౌడీ షీటర్ గవాస్కర్ తేజ