తిరుపతి నుండి రాజమండ్రికి వెళ్తుండగా.. నెల్లూరు జిల్లా గూడూరు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి ఓ కారు బలంగా ఢీ కొట్టడం జరిగింది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో.. నలుగురు మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది.
గూడూరు ఆదిశంకరా ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో జాతీయరహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. సింగిల్ రోడ్డు కావడం వల్ల తరచుగా అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. వేగ నియంత్రణకు స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయడంతో.. ముందు వెళుతున్న లారీ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడం వల్ల కారు లారీని ఢీకొంది. అదే సమయంలో కారు వెనుకగా వచ్చిన మరో లారీ.. ఆ కారును బలంగా ఢీ కొట్టడంతో కార్ రెండు లారీలు మధ్య నుజ్జు నుజ్జు అయింది.