నెల్లూరు రెడ్ క్రాస్‌లో ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభమైంది. 100 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో.. వైద్యులు సూచన మేరకు బాధితులకు వీటిని అందిస్తున్నట్లు రెడ్ క్రాస్ ప్రతినిధులు తెలిపారు. జిల్లా కలెక్టర్ చక్రధర్‌బాబు దీనిని ప్రారంభించారు.
కరోనా థర్డ్ వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామన్న కలెక్టర్.. రెడ్ క్రాస్ సేవలను కొనియాడారు. కరోనా సెకండ్ వేవ్ లో కొంత ఆక్సిజన్ కొరత ఏర్పడినప్పటికీ అధిగమించామన్నారు. ప్రతి 50 పడకల ఆసుపత్రిలోనూ ఆక్సిజన్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వైరస్ బారిన పడకుండా ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యాక్సిన్ వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.