నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా... రమేష్‌రెడ్డి నగర్లో తెదేపా, వైకాపా నేతల మధ్య తరచూ వివాదం కొనసాగుతోంది. తెదేపా అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో... ఈ అంశంపై ప్రశ్నించేందుకు వారు నామినేషన్ కేంద్రానికి వచ్చారు. ఆ సమయంలో అధికార పార్టీ నేతలు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. కారణం చెప్పకుండా తెదేపా అభ్యర్ధుల నామినేషన్‌ను ఎందుకు రద్దు చేశారో చెప్పాలని బాధితులు డిమాండ్ చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
NELLORE CORPORATION : ముదురుతోన్న వివాదం...రోజురోజుకు తీవ్రతరం - quarreling between TDP, YCP leaders in nellore
నెల్లూరు రమేష్‌రెడ్డి నగర్లో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. తెదేపా అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో... ఈ అంశంపై ప్రశ్నించేందుకు వారు నామినేషన్ కేంద్రానికి వచ్చారు.
నెల్లూరు రమేష్‌రెడ్డి నగర్లో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య వివాదం