నెల్లూరు నగరంలోని ముత్తుకూరు బస్టాండ్ సెంటర్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మానవహారం నిర్వహించారు. కృష్ణపట్నం పోర్టులో యాజమాన్యం మారినా... కార్మికుల కష్టాలు మాత్రం తగ్గలేదని సీఐటీయూ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ సమయంలో పూర్తిస్థాయి వేతనాలు చెల్లించాలని, పాత కార్మికులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలను అమలు చేయాలని కోరారు. కార్మిక సమస్యలపై ఈనెల 29న ఛలో కృష్ణపట్నం పోర్టు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
'కృష్ణపట్నం పోర్టులో కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించండి' - కృష్ణపట్నం పోర్ట్ లో కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించండి
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. కార్మిక సమస్యలపై ఈనెల 29న ఛలో కృష్ణపట్నం పోర్టు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
కృష్ణపట్నం పోర్ట్ లో కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించండి