నెల్లూరు జిల్లా కోవూరు వైకాపా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గూడూరు నియోజకవర్గంలోని కోట వైకాపా నాయకులు, తన కుటుంబ సభ్యులపైన ఫైర్(PRASANNA KUMAR REDDY SERIOUS OVER YSRCP LEADERS) అయ్యారు. లంచం ఇవ్వనిదే ఏ పని జరగడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. కోట పంచాయతీలో ఏ పని జరగాలన్నా లంచమివ్వాల్సి వస్తుందని విమర్శించారు. పద్ధతి మార్చుకోకపోతే పార్టీలోని సొంత కుటుంబ సభ్యులను, వైకాపా నాయకులను సైతం సహించేది లేదని హెచ్చరించారు.
కొన్ని కారణాల వల్ల పార్టీని వీడి వెళ్లినవారిని మళ్లీ తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. త్వరలో అందరినీ స్వయంగా కలుస్తానని అన్నారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో.. తన బాధ్యత లేకపోయినా కొంతమంది గెలవకపోవడంతో తనను నిందిస్తున్నారని ఆరోపించారు.