Police protest: నెల్లూరు జిల్లాలో ఏఆర్ పోలీసుల బదిలీ వివాదాస్పదంగా మారింది. బదిలీలపై సిబ్బంది ఏకంగా నిరసనకు దిగారు. సీనియార్టీ లిస్ట్ పట్టించుకోకుండా.....తమను ఇతర జిల్లాలకు మార్చారంటూ నెల్లూరు జిల్లాఎస్పీ కార్యాలయం సమీపంలోని ఏఆర్ హెడ్‌క్వార్టర్స్ వద్ద..కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే రిటైర్మెంట్ తీసుకుంటామని అన్నారు. ఆందోళన చేస్తున్న సిబ్బందికి అధికారులు సర్ది చెప్పారు. కార్యాలయంలో కూర్చోపెట్టి చర్చలు జరుపుతున్నారు.
Police protest: మేము అక్కడికి వెళ్లం... నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద పోలీసులు నిరసన
Police protest: నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద పోలీసులు నిరసన చేపట్టారు. తమను చిత్తూరుకు మార్చడంపై పోలీసులు నిరసన వ్యక్తం చేయడంతో సర్దిచెప్పి కార్యాలయంలో అధికారులు చర్చలు జరుపుతున్నారు.
పోలీసులు నిరసన