ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎస్​ఈబీ ఏఎస్పీ వీరంగం : మద్యం మత్తులో హల్​చల్ - నెల్లూరు జిల్లా వార్తలు

నెల్లూరు జిల్లాలో మద్యం మత్తులో ఒక పోలీసు అధికారి హల్​చల్​ చేశాడు. బాధ్యతాయుతమైన పనిచేస్తూ పౌరులను క్రమశిక్షణలో ఉంచాల్సిన ఆయనే.. అసభ్యకర దూషనలతో దాడికి పాల్పడ్డాడు. దీనిపై స్థానికులు స్థానికులు సదరు అధికారిని శిక్షించాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.

police officer drunk fight at hotel in nellore
'మద్యం మత్తులో ఎస్​ఈబీ ఏఎస్పీ వీరంగం'

By

Published : Apr 5, 2021, 6:36 AM IST

నెల్లూరు జిల్లాలోని కోవూరులో ఏఎస్పీ స్థాయి పోలీస్ అధికారి మద్యం మత్తులో హల్‌చల్ సృష్టించారు. స్పెషల్ ఎన్​ఫోర్స్ మెంట్ బ్యూరోలో ఏఎస్పీగా విధులు నిర్వహించి, ప్రస్తుతం వీఆర్​లో ఉన్న శ్రీధర్ బాబు నెల్లూరు గ్రాండ్ హోటల్‌కు కారులో వచ్చారు. మద్యం మత్తులో స్థానికులను, చుట్టుపక్కన ఉన్నవారిని అసభ్యకర పదజాలంతో దుర్భాషలాడుతూ, పలువురిపై దాడికి పాల్పడ్డాడు. అటుగా వచ్చిన బస్సులో నుంచి దిగిన మహిళా ప్రయాణికులనూ దూషించారు.

సర్వత్రా ఆగ్రహం..

పోలీస్ అధికారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు, అతను వచ్చిన వాహనాన్ని ధ్వంసం చేశారు. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన పోలీసులను ఫుల్లుగా తాగిన ఆ అధికారి తీవ్ర పదజాలంతో దుర్భాషలాడాడు.

ఠాణా ఎదుట ఆందోళన..

పోలీసు అధికారిని శిక్షించాలంటూ స్థానికులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. సదరు అధికారిని వైద్య పరీక్షల కోసం నెల్లూరులోని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని నెల్లూరు రూరల్ డీఎస్పీ హరనాథ్ రెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

సారా బట్టీలపై దాడులు... భారీగా బెల్లం ఊట ధ్వంసం

ABOUT THE AUTHOR

...view details