నెల్లూరు జిల్లాలో పోలీసులు తనిఖీలు విస్తృతం చేశారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సోదాలు ముమ్మరం చేశారు. ప్రత్యేకించి నాయుడుపేట జాతీయ రహదారిపై నెల్లూరు నుంచి తిరుపతి, శ్రీకాళహస్తి వెళ్లే వాహనాలను ఆపి నిశితంగా పరిశీలిస్తున్నారు. నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలో కొంతమంది భాజపా నాయకులు నగదు పంచుతున్నారని సమాచారం రావటంతో... వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నామని ఎస్.ఐ వేణు తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని... వారి నుంచి కారును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
నెల్లూరులో పోలీసుల విస్తృత తనిఖీలు - police checkings
నెల్లూరు జిల్లాలో పోలీసులు తనిఖీలు విస్తృతం చేశారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సోదాలు ముమ్మరం చేశారు. మద్యం, డబ్బు పంపిణీ చేసే అవకాశం ఉండటంతో అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.
నెల్లూరులో పోలీసుల విస్తృత తనిఖీలు