నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట మునిసిపాలిటీ పదహారో వార్డు కౌన్సిలర్ సురేశ్... తన పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు వెళ్లాడు. దర్శనం ముగించుకుని ఇంటికి వచ్చి, కారును పార్కింగ్ చేస్తుండగా... సురేశ్ బినామీగా ఉన్న తంగి బాలు కత్తితో సురేశ్‌ను దారుణంగా పొడిచి హత్య చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఐదు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడు తంగి బాలును పోలీసులు అరెస్టు చేశారు.
MURDER CASE CHASED : కౌన్సిలర్ హత్య కేసు ఛేదన... ఆధారాల కోసం పోలీసుల దర్యాప్తు - nellore district crime
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో సంచలనం కలిగించిన కౌన్సిలర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. 16వ వార్డు కౌన్సిలర్ సురేశ్ ను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచారు.
కౌన్సిలర్ హత్య కేసు ఛేదన
సురేశ్‌ను చంపేస్తే... తన పేరు మీద ఉన్న ఆస్తిని పూర్తిగా హస్తగతం చేసుకోవచ్చనే ఉద్దేశంతోనే ఈ నెల జులై నుంచే హత్యకు బాలు ప్రయత్నాలు చేశాడని విచారణలో వెల్లడైంది. కేసుకు సంబంధించిన మరిన్ని సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇదీచదవండి