ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Peanut farmers protest:ఆత్మకూరు మార్కెట్ యార్డులో శనగ రైతుల ఆందోళన

Peanut farmers protest: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మార్కెట్ యార్డులో శనగ కొనుగోళ్లకు కొర్రీలు వేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రైతు భరోసా కేంద్రం ద్వారా శనగల మార్కెట్​కు తరలించారు. నీ యార్డు అధికారులు మాత్రం... దుమ్ము, ధూళి ఉందంటూ కొనుగోళ్లకు నిరాకరిస్తున్నారని రైతులు ఆరోపించారు. రోజుల తరబడి యార్డులో నిరీక్షించాల్సి వస్తోందని వాపోయారు. మరోవైపు వర్షాలకు పంట తడుస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు.

Peanut farmers protest
శనగ రైతుల ఆందోళన

By

Published : May 7, 2022, 12:16 PM IST

Peanut farmers protest: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మార్కెట్ యార్డ్ వద్ద శనగ రైతులు ఆందోళనకు దిగారు. పండించిన శనగ పంటను రైతు భరోసా కేంద్రం ద్వారా మార్కెట్​కు తరలించారు. కానీ శనగలో దుమ్ము, ధూళి ఉందంటూ అధికారులు కొనుగోలు చేయకుండా నిరాకరిస్తున్నరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు శనగలను జల్లెడ పట్టినా నాసిరకంగా ఉన్నాయంటూ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. దీంతో రైతులు రోజుల తరబడి పడిగాపులుకాయాల్సినా పరిస్థితి ఏర్పతోందని చెబుతున్నారు. వాతావరణ మార్పులతో చేతికొచ్చిన పంట... వర్షం వస్తే తడిసి నష్ట పోతామని రైతులు ఆవేదన చెందుతున్నారు.

అద్దె ట్రాక్టర్​లలో పంటను మార్కెట్ యార్డ్ తీసుకొచ్చి రోజుల తరబడి ఉండాల్సి వస్తుండడంతో ట్రాక్టర్లకు రోజుకు రూ.3వేల చొప్పున నగదు కట్టాల్సి వస్తోందని వాపోతున్నారు. మార్కెట్ యార్డ్​ల వద్ద కనీసం రైతులకు తాగేందుకు చుక్క నీరు కూడా దొరకడం లేదని తెలిపారు. వర్షం వస్తే బస్తాలను మూసేందుకు పట్టలు కూడా ఇవ్వటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇదేంటని అధికారులను ప్రశ్నిస్తే 'వ్యవసాయ శాఖ మంత్రికి వెళ్లి చెప్పుకోండి' అంటూ నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారని అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి చొరవ తీసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.


ఇదీ చదవండి:Atchannaidu letter to CM Jagan: సీఎం జగన్​కు అచ్చెన్న బహిరంగ లేఖ

ABOUT THE AUTHOR

...view details