ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Road accident రోడ్డు ప్రమాదంలో గాయపడి కాపాడాలంటూ 40 నిమిషాలు ఆర్తనాదాలు

By

Published : Aug 13, 2022, 10:13 AM IST

Updated : Aug 13, 2022, 11:11 AM IST

నెల్లూరు జిల్లాలో మినీ లారీ, ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో క్లీనర్​ తీవ్రంగా గాయపడ్డాడు. కాపాడాలంటూ 40 నిమిషాలపాటు అతడు ఆర్తనాదాలు మిన్నంటాయి. చివరికి 108 వాహనం రాకపోవడంతో మృతి చెందాడు. అసలేం జరిగిందంటే..?

road accident
రోడ్డు ప్రమాదం

మినీ లారీ ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో క్లీనర్‌ మృతిచెందిన సంఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు కోల్డ్‌స్టోరేజి సమీపంలో శుక్రవారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... టమాటాల లోడుతో మదనపల్లె నుంచి నర్సీపట్నం వెళుతున్న లారీ కోల్డ్‌స్టోరేజీ సమీపంలో ఆగింది. కడప జిల్లా పోరుమామిళ్ల నుంచి ప్రకాశం జిల్లా కనిగిరికి పాలు, పెరుగు లోడుతో వెళుతున్న మినీ లారీ తెల్లవారుజామున 4:40 గంటల సమయంలో వేగంగా ఢీకొంది. మినిలారీలో ఉన్న కడప జిల్లా గోపవరం మండలం వడ్డే ఆగ్రహారం గ్రామానికి చెందిన క్లీనర్‌ వేముల వెంకటేష్‌(22) తీవ్ర గాయాలతో క్యాబిన్‌లోనే చిక్కుకొని మృతిచెందగా, మైదుకూరుకు చెందిన డ్రైవర్‌ చెంగారి సురేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. 108 వాహనం కోసం సమాచారమిచ్చినా అందుబాటులో లేకపోవడంతో.. క్లీనర్‌ దాదాపు 40 నిమిషాల దాకా కాపాడాలని వేడుకుంటూ క్యాబిన్‌లోనే ప్రాణాలు కోల్పోయాడని డ్రైవర్‌ సురేష్‌ తెలిపారు. 108 వాహనం వచ్చి ఉంటే బతికేవాడని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరికుంటపాడు మండలంలో నాలుగు నెలలుగా 108 వాహనం మరమ్మతులతో వినియోగంలో లేదు. జాతీయ రహదారిపై ప్రమాదాల్లో క్షతగాత్రులను తరలించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Last Updated : Aug 13, 2022, 11:11 AM IST

ABOUT THE AUTHOR

...view details