Penna river: నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తి దగ్గర పెన్నానది వరద ప్రవాహంలో నలుగురు చిక్కుకున్నారు. నది అవతల ఊరికి వెళ్లేందుకు నది దాటుతుండగా అకస్మాత్తుగా పెరిగిన ప్రవాహంలో వీరు చిక్కుకుపోయారు. అనీల్(18), అభిలాష్(12), ప్రవీణ్‌తోపాటు ఆరేళ్ల చిన్నారి భరత్... మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో నది దాటేందుకు ప్రయత్నించారు. ఎగువ ప్రాంతంల్లో కురుస్తున్న వర్షాలకు సోమశిల జలాశయానికి భారీ వరద వస్తుండటంతో జలాశయం నుంచి 60 వేల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. యువకులు నదిలో దిగిన సమయంలో ప్రవాహం తక్కువగా ఉండగా, నది మధ్యలోకి వెళ్లేసరికి ఒక్కసారిగా వరద ప్రవాహం అధికమైంది. దీంతో నదిలో చిక్కుకున్న వీరిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు బోటు సహాయంతో వీరిని రక్షించి క్షేమంగా ఒడ్డుకు చేర్చారు.
Penna river: పెన్నానది వరదలో చిక్కుకున్న నలుగురు క్షేమం - పెన్నానదిలో చిక్కుకున్న నలుగురు
Penna river: పెన్నానది వరదలో చిక్కుకున్న నలుగురు క్షేమంగా బయటపడ్డారు. నది దాటేందుకు ప్రయత్నించి ప్రవాహ ఉద్ధృతి ఎక్కువ కావడంతో ప్రవాహంలో చిక్కుకున్న నలుగురిని అధికారులు రక్షించారు. అసలేం జరిగిందంటే..?

పెన్నానది వరదలో చిక్కుకున్న నలుగురు
పెన్నానది వరదలో చిక్కుకున్న నలుగురు
Last Updated : Sep 10, 2022, 6:55 PM IST