కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 14న నెల్లూరు జిల్లా వెంకటాచలం రానున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో కలిసి సరస్వతీనగర్‌లోని అక్షర విద్యాలయం, సోమా సాంకేతిక శిక్షణ సంస్థలను పరిశీలించనున్నారు. అక్కడి నుంచి స్వర్ణభారత్ ట్రస్టుకు చేరుకుని ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 12.10గంటల వరకు జరిగే ట్రస్టు 20వ వార్షికోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత అక్షర విద్యాలయం ప్రాంగణంలోని పర్ణశాలలో మధ్యాహ్న భోజనం చేసి.. తిరుపతి వెళ్తారని స్వర్ణభారత్ ట్రస్టు సమన్వయకర్త జనార్దన్‌రాజు తెలిపారు.
Amith shah Venkatachalam tour : ఈనెల 14న వెంకటాచలానికి అమిత్‌షా - వెంకటాచలం వార్తలు
ఈ నెల 14న నెల్లూరు జిల్లా వెంకటాచలానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో కలిసి పర్యటించనున్నారు.
అమిత్ షా