నెల్లూరు జీజీహెచ్‌లో అత్యాధునిక ఏజీఎన్ఏ వెంటిలేటర్లు అందుబాటులోకి వచ్చాయి. కార్పొరేట్ స్థాయికి ధీటుగా ఉండేందుకు 130 వెంటిలేటర్లును అధికారులు ఆసుపత్రికి తెప్పించారు. జాయింట్ కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు ఆర్డీవో హుస్సేన్ సాహెబ్ జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ రెడ్డి తదితరులు తనిఖీ చేసి ప్రారంభించారు. ఇప్పటికే జీజీహెచ్‌లో 120 వెంటిలేటర్లు ఉన్నాయి. తాజాగా వచ్చిన వాటితో కలిపి వీటి సంఖ్య 250కు చేరిందని అధికారులు తెలిపారు.
జీజీహెచ్‌కు చేరిన అత్యాధునిక ఏజీఎన్ఏ వెంటిలేటర్లు - nellore latest news
నెల్లూరు జీజీహెచ్‌కు 130 అత్యాధునిక ఏజీఎన్ఏ వెంటిలేటర్లు చేరుకున్నాయి. వీటితో ఆసుపత్రిలో మొత్తం 250 వెంటిలేటర్లు ఉన్నాయి. కార్పొరేట్ స్థాయికి దీటుగా వైద్యం అందించేందుకు అధికారులు వీటిని తెప్పించారు.
ఆసుపత్రికి చేరిన అత్యాధునిక ఏజీఎన్ఏ వెంటిలేటర్లు