ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నాసిరకం రోడ్లు నిర్మించి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు' - నెల్లూరు నాసిరకం రోడ్లపై కోటంరెడ్డి విమర్శలు

నాసిరకం రోడ్లను నిర్మించి ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారంటూ.. తెదేపా నేత, నుడా మాజీ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నెల్లూరులో నగరంలో నిరసన వ్యక్తం చేశారు. మంత్రి బంధువులే రహదారి పనులు దక్కించుకుని.. కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించడంలేదని ఆరోపించారు.

poor quality roads
నాసిరకం రోడ్ల నిర్మాణం

By

Published : Dec 24, 2020, 7:14 PM IST

నాసిరకం రోడ్ల నిర్మాణం

నెల్లూరు నగరంలో రహదారులను నాసిరకంగా నిర్మిస్తున్నారంటూ.. తెదేపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద కనీస నాణ్యత ప్రమాణాలు పాటించలేదని.. నుడా మాజీ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆందోళన నిర్వహించారు. మినీ బైపాస్ నుంచి శెట్టిగుంట వరకు రూ. 3.60 కోట్లతో నిర్మిస్తున్న రోడ్డు వద్ద.. కనీసం ప్రభుత్వ పర్యవేక్షణాధికారి లేరని విమర్శించారు.

మంత్రి బంధువులే రోడ్డు పనులు దక్కించుకుని.. ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని శ్రీనివాసులురెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ అధికారులతోపాటు కేంద్ర మంత్రి గడ్కరీకి ఫిర్యాదు చేస్తామన్నారు. నాణ్యతతో కూడిన నిర్మాణాలు చేపట్టకుంటే.. ప్రజా ఉద్యమానికి వెనకాడబోమని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details