హాథ్రాస్లో హత్యాచార ఘటనపై నెల్లూరులో విద్యార్థి ఐకాస ఆందోళన చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని ఉరి వేస్తున్నట్లుగా నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్ద వినూత్న నిరసన చేపట్టారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని విద్యార్థి నేతలు కోరారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
హాథ్రాస్ ఘటనపై విద్యార్థి ఐకాస ఆందోళన
నెల్లూరులో విద్యార్థి ఐకాస ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. హాథ్రాస్ ఘనటకు పాల్పడ్డ నిందితులను ఉరి వేస్తున్నట్లు వినూత్న రూపంలో నిరసన చేపట్టారు. యూపీ ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని తెలిపారు.
హాథ్రాస్ ఘటనపై విద్యార్థి జేఏసీ ధర్నా