ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పెన్నా వరదలో రంగనాథస్వామి ఆలయం

By

Published : Nov 27, 2020, 9:42 PM IST

పెన్నా నదిలో ప్రవాహం పెరగగా.. నెల్లూరులోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలోకి నీరు చేరింది. మోకాళ్లలోతు నదీ జలాలు గుడిని చుట్టుముట్టాయి. దేవాలయాన్ని పరిశీలించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. స్వామివారికి పూజలు నిర్వహించారు.

penna floods in ranganadha swamy temple
రంగనాథ స్వామి ఆలయంలోకి పెన్నా వరదనీరు

నెల్లూరులో పెన్నా నది పరవళ్లు తొక్కుతోంది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరదనీరు.. నగరంలో ప్రసిద్ధి చెందిన శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని చుట్టుముట్టింది. గర్భాలయంలోకి నదీ జలాలు ప్రవేశించాయి. ప్రస్తుతం మోకాళ్లలోతు నీరు ఆలయంలోకి చేరింది. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గుడిని పరిశీలించి.. స్వామి వారికి పూజలు నిర్వహించారు.

రంగనాథ స్వామి ఆలయంలోకి పెన్నా వరదనీరు

సోమశిల జలాశయం నుంచి 3 లక్షల 69 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తుండగా.. పెన్నా నది వద్ద 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవహిస్తోంది. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details