ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా పాజిటివ్​ వచ్చిన ఓ ప్రధానోపాధ్యాయుడి ఆవేదన..! - corona patients problems through videos news

'ఓ ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఎంతో సమర్థంగా పనిచేశాను. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాడు-నేడు కార్యక్రమాన్ని నిబద్ధతతో చేసి ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధుల ప్రశంసలు పొందాను. అయితే దురదృష్టవశాత్తు నాకు కరోనా పాజిటివ్​గా నిర్ధారణయ్యింది. చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే.. నన్ను చేర్చుకోలేదు. దయ ఉంచి నన్ను ఆస్పత్రిలో చేర్చుకునేలా చూడండి'. వీడియోలో ఓ ప్రధానోపాధ్యాయుడి ఆవేదన ఇది. పూర్తి వివరాలివి..!

కరోనా పాజిటివ్​ వచ్చిన ఓ ప్రధానోపాధ్యాయుడి ఆవేదన..!
కరోనా పాజిటివ్​ వచ్చిన ఓ ప్రధానోపాధ్యాయుడి ఆవేదన..!

By

Published : Aug 9, 2020, 1:13 AM IST

తనను ఆస్పత్రిలో చేర్చుకోవాలని ఓ ఉపాధ్యాయుడి ఆవేదన

నెల్లూరు జిల్లా మనుబోలు బాలుర హైస్కూల్​ ప్రధానోపాధ్యాయునికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. చికిత్స కోసం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లగా తనను చేర్చుకోలేదు. దీనిపై ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. తన బాధను వీడియో రూపంలో వెలిబుచ్చారు. తాను డయాలసిస్​ పేషెంట్​నని, రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయని.. ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని బాధితుడు చెప్పారు.

ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఎంతో సాధించానని.. ఇటీవల నాడు-నేడు కార్యక్రమం ద్వారా నా పాఠశాల అభివృద్ధికి కృషి చేసి... ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధుల నుంచి ప్రశంసలు అందుకున్నానని ఆయన చెప్పారు. తనను చేర్చుకునేలా ఆస్పత్రి సిబ్బందికి సూచించాలని స్థానిక ప్రజా ప్రతినిధులకు, ఉన్నతాధికారులకు వీడియోలో విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ఆస్పత్రి అధికారులు చివరకు ఆయన్ను ఆస్పత్రిలో చేర్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details