ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అవసరమైన సమయంలో టెలీ మెడిసిన్​ సేవలు పొందండి' - coronavirus news in andhra

నెల్లూరు జిల్లాలో కొవిడ్ కేసులు విస్తరిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా 67 కేసులు నమోదయ్యాయి. బుధవారం ఏడుగురు డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లా వైద్యారోగ్య శాఖ చేపడుతున్న చర్యలు ఎలా ఉన్నాయి? కరోనా పరీక్షలు ఎలా సాగుతున్నాయి..? ఈ పరిస్థితిపై జిల్లా వైద్యాధికారిణి రాజ్యలక్ష్మితో ఈటీవీ భారత్ ముఖాముఖి.

nellore dmho
nellore dmho

By

Published : Apr 23, 2020, 9:32 AM IST

ఈటీవీ భారత్​తో నెల్లూరు జిల్లా వైద్యాధికారిణి రాజ్యలక్ష్మి

కరోనా పరీక్షల నిమిత్తం.. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 4 వేలకు పైగా శాంపిల్స్ సేకరించామని జిల్లా వైద్యాధికారిణి రాజ్యలక్ష్మి తెలిపారు. ప్రస్తుతం ఐసోలేషన్ లో 59 మంది ఉన్నారని చెప్పారు. క్వారంటైన్ వార్డుల్లో 250 మందికి పైగా ఉంచామని.. టెలీ మెడిసన్ సేవలు మొదలయ్యాయని తెలిపారు. ఎవరికైనా అవసరమైతే టెలీ మెడిసన్ ద్వారా వైద్య సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. ప్రజలు భౌతిక దూరం పాటించాలని సూచించారు. కరోనా కేసుల కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details