ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నెల్లూరులో పారిశుద్ధ్య కార్మికుల మెరుపు సమ్మె - నెల్లూరులో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె

మున్సిపల్ కార్మికుల జీతాల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ.... నెల్లూరులో కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకు దిగారు.

Nellore Corporation sanitation workers went on strike demanding a solution to their problems.
నెల్లూరులో పారిశుద్ధ్య కార్మికులు సమ్మె

By

Published : Nov 4, 2020, 2:39 PM IST


తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ... నెల్లూరులో కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నగరంలోని వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో విధులు నిర్వహించిన తమకు అయిదు నెలలుగా జీతాలు కూడా లేవని ఈ సందర్భంగా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా విధులు నిర్వహించిన తమను పొగడ్తలతో ముంచెత్తిన ప్రభుత్వం, కనీసం జీతాలు కూడా ఇవ్వకపోవడం ఏమిటని వారు ప్రశ్నించారు.

కార్యాలయాల్లో కూర్చొని విధులు నిర్వహించే ఉద్యోగులకు మాత్రం కరెక్ట్​గా జీతాలు చెల్లించే ప్రభుత్వం, తమకు జీతాలు ఇవ్వకపోవడంతో, అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకోవాల్సి వస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. జీతాల బకాయిలు వెంటనే చెల్లించడంతో పాటు డ్రైవర్లకు హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ మొత్తాన్ని జమ చేయాలని, ఆర్.టి.ఎం.ఎస్. విధానంతో కార్మికులను వేధించే చర్యలు మానుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

మిస్టరీగా ఉక్కు - పోస్కో ఒప్పందం

ABOUT THE AUTHOR

...view details