ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆత్మకూరు ఉపఎన్నికలో మెుబైల్ పోలింగ్ పోస్టల్ బ్యాలెట్లు.. వాళ్ల కోసమే అంటా - Atmakuru byelection updates

Mobile polling postal ballots: ఆత్మకూరు ఉపఎన్నిక సందర్భంగా ఏర్పాటు చేసిన మెుబైల్ పోలింగ్ పోస్టల్ బ్యాలెట్లను జిల్లా కలెక్టర్ చక్రధర్​ బాబు పరిశీలించారు. పలు గ్రామాల్లో మొబైల్ పోలింగ్ పోస్టల్ బ్యాలెట్‌ను కలెక్టర్​ ప్రారంభించారు. వృద్ధులు, వికలాంగుల కోసం ఈ ప్రక్రియ చేపట్టినట్లు కలెక్టర్​ చెప్పారు.

Mobile polling postal ballots
Mobile polling postal ballots

By

Published : Jun 16, 2022, 4:53 AM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన మెుబైల్ పోలింగ్ పోస్టల్ బ్యాలెట్లను కలెక్టర్ చక్రధర్ బాబు పరిశీలించారు. అనుమసముద్రం, దువ్వూరు, గ్రామాల్లో మొబైల్ పోలింగ్ పోస్టల్ బ్యాలెట్‌ను ప్రారంభించారు. కొవిడ్ పరిస్థితుల్లో వికలాంగులు, 80 ఏళ్లు దాటిన వృద్ధులు ఇబ్బందులు పడకుండా మొబైల్ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇంటి వద్దకే వెళ్లి పోస్టల్ బ్యాలెట్ విధానంలో వృద్ధులు, వికలాంగులతో ఓట్లు వేయించారు. ఇంటి వద్దకే వెళ్లి ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రత్యేక బృందాలతో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల ప్రక్రియను ఆయన వివరించారు.

ABOUT THE AUTHOR

...view details