ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పోర్టు కార్మికుల ధర్నాలో ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం - ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం కృష్ణపట్నం పోర్టు కార్మికులకు హామీ

నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న.. కృష్ణపట్నం పోర్టు కార్మికులతో ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడారు. యాజమాన్యం మార్పు కారణంగా సిబ్బందిపై వేధింపులకు దిగడాన్ని ఖండించారు. ఈ సమస్యను రానున్న శాసనసభ, మండలి సమావేశాల్లో లేవనేత్తుతానని హామీ ఇచ్చారు.

mlc speaking with workers
కార్మికులతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ

By

Published : Nov 21, 2020, 4:55 PM IST

కార్మికులతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ

రానున్న శాసనసభ, మండలి సమావేశాల్లో.. కృష్ణపట్నం పోర్టు కార్మికుల సమస్యలను లేవనెత్తుతానని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట చేస్తున్న ధర్నా నిర్వహిస్తున్న కార్మికులతో ఆయన మాట్లాడారు.

యాజమాన్యం, కార్మికులు సమన్వయంతో పని చేసి పరిశ్రమను అభివృద్ధి చేయాలి కానీ.. సిబ్బందిని వేధించడం సరికాదని ఎమ్మెల్సీ తెలిపారు. పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని మార్చేందుకు కేంద్రం ప్రయత్నించడాన్ని ఖండించారు. అందరూ ఐక్యంగా పోరాడితేనే సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. దాదాపు 20 వేల మంది కార్మికులున్న కృష్ణపట్నం పోర్టులో.. సమస్యల పరిష్కారానికి యాజమాన్యం చొరవ చూపాలన్నారు. కార్మికులకు అన్ని విధాలుగా తాము అండగా ఉంటామని ప్రకటించారు.

ఇదీ చదవండి:సమస్యలకు నిలయాలుగా గ్రంథాలయాలు!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details