కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. కోవూరు మండలం ఇనమడుగు వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టింది. కోవూరు మండలం ఇనమడుగు గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు.. నెల్లూరు నుంచి వెళ్తుండగా జాతీయ రహదారిపై ఎమ్మెల్యే వాహనం ప్రమాదానికి గురైంది. వేగంగా వచ్చిన లారీ ఎమ్మెల్యే వాహనాన్ని రాసుకుపోవడంతో స్వల్పంగా దెబ్బతింది. ప్రమాదంలో ఎమ్మెల్యేతోపాటు వాహనంలో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారు.
డ్రైవర్ మద్యం సేవించి లారీ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ఎమ్మెల్యే అనుమానం వ్యక్తం చేశారు. భగవంతుని దయ, నాయకులు, కార్యకర్తల ఆశీర్వాదం వల్లే ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డానని ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. కోవూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.