ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 12, 2021, 4:30 PM IST

ETV Bharat / city

ఎవరి ప్రయోజనాల కోసం నిమ్మగడ్డ ఆరాటపడుతున్నారు: మంత్రులు

ఎస్​ఈసీ రమేశ్​కుమార్​పై మంత్రులు అనిల్​కుమార్, అవంతి శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. ఎవరి ప్రయోజనాల కోసం ఎన్నికల నిర్వహిస్తామంటూ ఆరాటపడుతున్నారని విమర్శించారు. హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదన్నారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ నిమ్మగడ్డ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా వైకాపాదే విజయమన్నారు.

ap sec
నిమ్మగడ్డపై మంత్రులు ఫైర్

మంత్రి అనిల్ కుమార్

ఎవరి ప్రయోజనాల కోసం ఎన్నికల నిర్వహణకు నిమ్మగడ్డ రమేశ్​కుమార్ అరాటపడుతున్నారని మంత్రి అనిల్ ప్రశ్నించారు. నెల్లూరులో మాట్లాడిన ఆయన.. హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్​ కోసం ఏర్పాట్లను సిద్ధం చేస్తుంటే... ఒక వ్యక్తి అజెండా కోసం రమేశ్​కుమార్ నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తరువాత పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలన్నారు. ఎన్నికల విషయంలో ఎస్​ఈసీ ఏకపక్ష ధోరణితో ముందుకెళ్తున్నారని విమర్శించారు.

నిమ్మగడ్డ రాజీనామా చేయాలి: మంత్రి అవంతి

హైకోర్టు తీర్పు ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్​కు చెంపపెట్టులాంటిదని మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఇందుకు నైతిక బాధ్యత వహించి ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలని లేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా వైకాపాదే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధి విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతున్నారని దుయ్యబట్టారు

ఇదీ చదవండి:ప్రమాదకర ప్రయాణం..మోపెడ్​పై రైతు విన్యాసం

ABOUT THE AUTHOR

...view details